ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రోడ్డుకు

ABN, First Publish Date - 2020-08-13T10:04:56+05:30

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు అప్రోచ్‌రోడ్డుకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూసేకరణ పూర్తి చేయండి : జేసీ


 కలెక్టరేట్‌ : భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు అప్రోచ్‌రోడ్డుకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, సర్వే శాఖ అధికారులతో తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే నుంచి ట్రంపెట్‌ ఆకారంలో ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాధించామన్నారు. ఈ రోడ్డుకు ఇటీవల సర్వే పూర్తయ్యిందని ,  భూసేకరణ  కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. 


పరిహారం నిమిత్తం ప్రభుత్వం  రూ.110 కోట్లు మంజూరు చేసిందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి , నిబంధనల మేరకు రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. తొలుత వారి బ్యాంకు ఖాతాల్లో రుపాయి చొప్పున జమ చేయాలని సూచించారు. డీఆర్‌వో  వెంకటరావు, ఆర్‌డీవో సాల్మన్‌రాజు, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు వెంకటేశ్వరరావు, బాలాత్రిపుర సుందరి, జయరాం, సర్వేశాఖ ఏడీ పీవీఎస్‌ కుమార్‌, భోగాపురం తహసీల్దార్‌ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-13T10:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising