ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2020-11-01T10:20:51+05:30

నిత్యావసరాల ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి


నెల్లిమర్ల, అక్టోబరు 31: నిత్యావసరాల ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో తెలుగు మహిళలు రామతీర్థం జంక్షన్‌లో ఆందోళన నిర్వహించారు.  కూరగాయల దండలను మేడలో వేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వనజాక్షి మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి వారి జీవనోపాధి కష్టతరంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపుతో అన్ని వర్గాలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణపై దృష్టి సారించాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు మహిళ ప్రఽధాన కార్యదర్శి అనూరాధ బేగం,  బయిరెడ్డి లీలావతి, లెంక హైమావతి, పత్తిగిళ్ల సూర్యకుమారి, వడ్లమాని సుభద్రమ్మ, కిల్లాన పార్వతి, రెడ్డిపల్లి ఉషారాణి, కింతాడ కళావతి, నరవ రామలక్ష్మి, రెడ్డి సంతోషి, చందక అరుణ, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T10:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising