ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2020-06-01T10:45:26+05:30

సాగు రైతులు రైతు భరోసా కేంద్రాలను వినియోగిం చుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం, మే 31: సాగు రైతులు రైతు భరోసా కేంద్రాలను వినియోగిం చుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.   పాతరేగలో ఆదివారం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన  గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా గ్రామస్థులు పాతరేగ, కొత్తరేగ గ్రామాల మధ్య కాజ్‌వే నిర్మాణం చేపట్టాలని కోరారు. త్వరలో నిధులు తెప్పించి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులందరూ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాతరేగలో డ్రైనేజీ, కాలువల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో ఉన్న కోనేరును  అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బూత్‌ కమిటీ అధ్యక్షుడు పత్తిగల ఏక్‌నాథ్‌, మాజీ సర్పంచ్‌లు గొర్లె శ్రీనివాసరావు, మరడరామునాయుడు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్‌, పెద్దింటి తిరుపతిరావు, సన్యాసిరావు, ఔగడ్డి బలరాం నాయుడు, మాజీ ఎంపీటీసీ పైడిపినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising