‘కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ బూటకం’
ABN, First Publish Date - 2020-05-19T07:39:56+05:30
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక బూటకమని ఏఐఎఫ్‌టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
నెల్లిమర్ల, మే 18: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక బూటకమని ఏఐఎఫ్‌టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొయిద సన్యాసిరావు ఆరోపించారు. నెల్లిమర్లలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఆటో కార్మికులు నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నా రు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.
Updated Date - 2020-05-19T07:39:56+05:30 IST