ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దులు మూసివేశాం

ABN, First Publish Date - 2020-04-07T11:51:56+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో రహదారులను మూసివేశా మని ఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాకు ఇతరులు రాకుండా కట్టడి 

ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు 

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు 

ఎస్పీ రాజకుమారి


విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో రహదారులను మూసివేశా మని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అత్యవసర వాహనాలు మాత్రమే రాణిస్తామన్నారు. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు గాను విజయ నగరం పట్టణంలో సోమవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి అవ గాహన ర్యాలీ చేశారు. ఈసంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశాఖపట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. విశాఖ నుంచి ఉద్యోగులు, వ్యాపారం నిమిత్తం వచ్చినవారిని జిల్లాకు రాకుండా కట్టడి చేశామన్నారు.


రాజాపులోవ వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటలు పాటు సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో తనిఖీలు చేపడుతున్నామన్నారు. అత్యవసర సమయాల్లో మినహా వాహనాల రాకపోకలను నియంత్రించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు చేపడ తామన్నారు. జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్‌పై ఒకవైపు అవగాహన కల్పిస్తునే మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా విదిలిస్తున్నామన్నారు. కేసులు నమోదు చేయ డంతో పాటు వాహనాలు సీజ్‌ చేస్తున్నామని తెలిపారు. సడలింపు సమయంలో ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువ, కార్లు, ఆటోల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదన్నారు.


అనంతరం రాజీవ్‌ క్రీడామైదానంలో రైతుబజారును సందర్శించారు. కొను గోలుదారులు భౌతిక దూరం పాటించాలని సూచిం చారు. కార్యక్రమంలో డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, మోహనరావు, సీఐలు ఎర్రంనాయుడు, కాంతారావు, డి.లక్ష్మణరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T11:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising