ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాస్తు బాగాలేదని....

ABN, First Publish Date - 2020-12-30T05:36:46+05:30

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి వెళ్తున్న అధికారులకు ఎదురువుతున్న వింత అనుభవాలు వారిని విస్మయపరుస్తున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో అనుభవం వారిని విస్తుపోయేలా చేస్తున్నాయి. మండలంలోని రాబంద గ్రామంలో గుర్తించిన 13 మందిలో ఐదుగురు మాత్రమే పట్టాలు అందుకోవడానికి హాజరయ్యారు.

పట్టాల లబ్ధిదారుల జాబితాలో పురుషుల పేర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఇళ స్థలాల తిరస్కరణ

అర్హులకు అన్యాయంపై కొన్నిచోట్ల నిలదీతలు

ఇద్దనవలసలో మహిళలకు బదులు పురుషుల పేర్లు

మెంటాడ, డిసెంబర్‌ 29: ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి వెళ్తున్న అధికారులకు ఎదురువుతున్న వింత అనుభవాలు వారిని విస్మయపరుస్తున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో అనుభవం వారిని విస్తుపోయేలా చేస్తున్నాయి. మండలంలోని రాబంద గ్రామంలో గుర్తించిన 13 మందిలో ఐదుగురు మాత్రమే పట్టాలు అందుకోవడానికి హాజరయ్యారు. మిగతావారు ఆసక్తి చూపలేదని తేలింది. ఆరాతీస్తే నచ్చని ప్రదేశంలో పట్టాలిచ్చారని... వాస్తుపరంగా చాలా దోషాలున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఇద్దనవలసలో మరో తరహా వింత చోటుచేసుకుంది. అక్కడ 17 మందిని ఎంపిక చేయగా ఆరుగురికి నిలిపేశారు. అర్హుల జాబితాలో పురుషుల పేర్లను నమోదు చేయడంతో వాటిని తిరస్కరించారు. ఈ విషయాల్ని మండల ప్రత్యేకాధికారి బి.రమణమూర్తి వద్ద ప్రస్తావించగా రాబందలో తాము గుర్తించిన నాటికి వారికి సొంత స్థలాలు లేవని, ఆ తర్వాత స్థలం కొనుగోలుచేసి ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. ఇద్దనవలసలో సాంకేతిక సమస్యల వల్ల ఆరుగురు పురుషుల పేర్లు నమోదై ఉన్నాయని తెలిపారు. వాటిని సరిచేస్తామని పేర్కొన్నారు.


Updated Date - 2020-12-30T05:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising