ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించిన యువతిని కలవనీయలేదని..

ABN, First Publish Date - 2020-12-21T05:06:39+05:30

ప్రేమించిన యువతిని కలవనీయ కుండా చేస్తున్నారన్న అక్కసుతో.. ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  తండ్రి, సోదరుడిపై యువకుడి దాడి

శృంగవరపుకోట, డిసెంబరు 20: ప్రేమించిన యువతిని కలవనీయ కుండా చేస్తున్నారన్న అక్కసుతో.. ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ధర్మపురంలో రెండు రోజుల కిందట జరిగిన ఘటన బాధితుల ఫిర్యాదుతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మపురానికి చెందిన అశోక్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. కానీ అశోక్‌ పెద్దల కుదిర్చిన సమీప బంధువులైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయినా ప్రేమించిన యువతి చుట్టూ తిరు తుండడంతో కుటుంబసభ్యులు ఎస్‌.కోట పోలీసులను ఆశ్రయించారు. ఇరువురిని పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కేసును విజయనగరం దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. ఇరు కుటుంబాలను రప్పించిన దిశ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ యువతిని కలవనని, ఇక నుంచి ఇబ్బంది పెట్టానని అశోక్‌ నుంచి లిఖితపూర్వకంగా హామీ పత్రాన్ని తీసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు గడవక ముందే.. రెండు రోజుల కింద ప్రేమించిన యువతిని కలిసే ప్రయత్నం చేశాడు. దీనిని యువతి తండ్రి, సోదరుడు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరిపై అశోక్‌ దాడిచేయడంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఎస్‌.కోట ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. 

 

Updated Date - 2020-12-21T05:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising