ప్రత్యేక కార్యాలయం అవసరం లేదు
ABN, First Publish Date - 2020-12-11T05:30:00+05:30
తెలుగుదేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని..ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకత్వం ఇస్తుందని..ప్రత్యేక కార్యాలయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కనకల మురళీమోహన, బొద్దల నర్సింగరావు, గంటా పోలీనాయుడు, ముద్దాడ చంద్రశేఖర్‌లు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు
విజయనగరం రూరల్, డిసెంబరు 11: తెలుగుదేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని..ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకత్వం ఇస్తుందని..ప్రత్యేక కార్యాలయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కనకల మురళీమోహన, బొద్దల నర్సింగరావు, గంటా పోలీనాయుడు, ముద్దాడ చంద్రశేఖర్‌లు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని..పార్టీ నిబంధనలు పాటించాలన్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత అధికారంలో లేకున్నా, ఉన్నా ప్రజల పక్షానే నిలిచిందన్నారు. అప్పట్లో రెండుసార్లు పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసినా.. నిర్వహణ భారం దృష్ట్యా తిరిగి అశోక్ బంగ్లాకే మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడే కార్యాలయం కొనసాగుతోందన్నారు. కెఎల్‌పురం వెళ్లే రహదారిలో కార్యాలయానికి సంబంధించి స్థలం సేకరించామని.. మునిసిపాల్టీ సైతం అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. కానీ అప్పట్లో నాయకత్వం ముందుకు రాకపోవడంతో అంశం మరుగున పడిపోయిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు, మద్ధాల ముత్యాలరావు, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST