ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధి వర్తకులకేదీ భరోసా?

ABN, First Publish Date - 2020-08-09T10:45:42+05:30

కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం నిధుల కోసం వీధి వర్తకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, ఆగస్టు 8: కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం నిధుల కోసం వీధి వర్తకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  లాక్‌డౌన్‌ ప్రభావవంతో వారి బతుకులన్నీ తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలో  కేంద్రం ప్రకటించిన పథకం ద్వారా గట్టెక్కాలని  భావిస్తున్నారు. అయితే బ్యాంకులతో ముడిపెట్టడంతో కొంతమంది అధికారుల నుంచి సహకారం అందడం లేదని వీధి వర్తకులు వాపోతున్నారు. వాస్తవంగా ఈ సాయం కోసం  మెప్మా ద్వారా  జిల్లా వ్యాప్తంగా  4,644 మంది ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఇంతవరకూ సాయం అందలేదు. బ్యాంకర్ల సమస్యను పరిష్కరించి త్వరగా  కేంద్ర సర్కార్‌ నిధులు అందజేయాలని వీధి వ్యాపారులు కోరుతున్నారు. జిల్లాలో పదివేల మందికి పైగా వీధివర్తకులు ఉంటారని, వారందరూ నమో దు కాలేదని వీధివర్తకుల సంఘం జిల్లా నేత మునకాల శ్రీనివాస్‌ తెలిపారు.


అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి  పేర్లను నమోదు చేయాలని కోరారు.  ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌  ప్రక్రియ పూర్త యినప్పటికీ బ్యాంకులు సహకరించడం లేదని తెలిపారు. బొబ్బిలిలో ఒక్క బ్యాంకు మాత్రమే రుణాలి చ్చేందుకు ముందు కొచ్చిందన్నారు. జిల్లాలోని మునిసిపాలిటీల్లో 1200 మందికి పీఎం స్వనిధి నుంచి సహాయం అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ సుగుణాకరరావు తెలి పారు.  ఇంతవరకు 752 పేర్లు అప్‌లోడ్‌ అయ్యా యని, 20 మందికి మంజూరయ్యాయని వివరిం చారు. విజయనగరంలో 2195 మంది, బొబ్బిలిలో 602, నెలిమర్లలో 263, పార్వతీపురంలో 867, సాలూరులో 755 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. బ్యాంకులు సహకరించాలని కోరామని, కరోనా కారణంగా దీనిపై పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-08-09T10:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising