ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాప్‌!..ఆగిన స్థానిక ఎన్నికల ప్రక్రియ

ABN, First Publish Date - 2020-03-16T09:58:23+05:30

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా కొవిడ్‌-19ను దేశంలో జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన పరిస్థితిలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ఉదయం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు వారాలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన

కరోనా వైరస్‌ కట్టడికే ఈ నిర్ణయం

నిలిచిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ఏకగ్రీవ ప్రాదేశికాలకు ఎన్నికలుండవ్‌

అభ్యర్థులు, నాయకుల్లో డీలా


స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయి. వాడీవేడిగా సాగిన ప్రచారం ఆగిపోయింది. కరోనా వైరస్‌ విజృంభించకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.


ఉదయం ఈ ప్రకటన వచ్చేంత వరకు చాలా మంది నాయకులు ఆదివారం ప్రచారంలో ఉన్నారు. సెలవుల రద్దుతో అధికారులూ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈసీ ప్రకటనతో అందరూ ఆగిపోయారు. పోటీలో ఉన్న కొందరు ప్రాదేశిక, మున్సిపల్‌ అభ్యర్థులు, సర్పంచ్‌ ఆశావహులు ఈ పరిణామంపై నిరాశ వ్యక్తంచేశారు. 


(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా కొవిడ్‌-19ను దేశంలో జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన పరిస్థితిలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ఉదయం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఎక్కడి ఎన్నికలు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా విడుదల కావాల్సిన పంచాయతీ మొదటి విడత నోటిఫికేషన్‌ కూడా ఆగిపోయింది. దీంతో బరిలో ఉన్న నాయకులు డీలా పడ్డారు. గడువు పెంచడంతో భారీగా ఖర్చులు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. కాగా ఎన్నికల కోడ్‌ మాత్రం కొనసాగుతుంది. ప్రభుత్వం నూతనంగా సంక్షేమ పథకాలను ప్రకటించకూడదు. గతంలో ప్రకటించిన ఇళ్ల స్థలాల పంపిణీ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు త్వరగా పూర్తయితే వెనువెంటనే ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది.


ఈసీ ప్రకటనతో ఈ తంతు మరింత జాప్యం కానుంది. అయితే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు దాదాపుగా పూర్తిచేశారు. పోలింగ్‌ నిర్వహించడానికి ఆయా పోలింగ్‌ స్టేషన్లకు పీవోలు, ఏపీవోలు, పీపీ (పోలింగ్‌ పర్సన్‌ )లను నియమించారు. మరో 15 శాతం అదనపు సిబ్బందిని కేటాయించారు.  పీవో, ఏపీవోలకు సోమవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈసీ ప్రకటన తర్వాత వాయిదా వేశారు. మరోవైపు పోలింగ్‌ కోసం కేరళ నుంచి తెప్పించిన బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 10 వేల బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగించాలని అంచనా వేశారు.


భద్రతకు సంబంధించి జిల్లాలో 196 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 176 సమస్మాత్మక ప్రాంతాలతో పాటు ఎన్నికలు సజావుగా జరగడానికి ఏర్పాట్లు చేశారు. 1029 కేసులు నమోదు చేసి 18,529 మందిని బైండోవర్‌ చేశారు. 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, నగదు ఇతర ప్రాంతాల నుంచి తరలిరాకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వాయిదా ప్రకటనతో అధికారులూ డీలా పడ్డారు. శిక్షణ తరగతులు వాయిదా వేశారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ మాత్రం కొనసాగిస్తున్నారు. 


మండల, జిల్లా పాదేశిక ఉన్నికలకు సంబంధించి ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల ఘట్టం. పరిశీలనలు, నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 549 మండల ప్రాదేశికాలకు గాను 55  ఏకగ్రీవం కాగా 494 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే  34 జిల్లా ప్రాదేశికాలుండగా మూడు చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 31 జిల్లా ప్రాదేశికాలకు మాత్రమే ఓటింగ్‌ నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఏ స్థాయిలో ఎన్నికలు నిలిచిపోయాయో అదే స్థాయినుంచి ఎన్నికలు పునః ప్రారంభవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఎన్నికైనట్టే. ఈ ప్రాదేశికాల్లో ఓటింగ్‌ ప్రక్రియ ఉండదు. ఈనెల 21న జరగాల్సిన ఓటింగ్‌ వాయిదా పడింది. 


ఇదిలా ఉండగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 50వార్డులకు.. పార్వతీపురం మున్సిపాలిటిలో 30, బొబ్బిలిలో 31, సాలూరులో 29 వార్డులకు.. నెల్లిమర్ల నగర పంచాయతీలోని 20వార్డులకు ఈనెల 10న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 11నుంచి 13వరకు నామినేషన్ల స్వీకరణ తంతు సాగింది. 14న నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. 15న ఆదివారం నామినేషన్లపై అభ్యంతరాలు, ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. కాని ఎన్నికలు వాయిదా పడ్డాయి. 


పంచాయతీలకు సంబంధించి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదటి విడత పార్వతీపురం డివిజన్‌లోని 15మండలాల్లో నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఆదివారం విడుదల కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న రెండో విడత విజయనగరం డివిజన్‌లోని 19 మండలాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా వాయిదా పడింది. కాగా సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో సర్పంచ్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని కొందరు ఆశావహులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  పోటీ చేయదలచిన వారు టెన్సన్‌ పడుతున్నారు.


గ్రామాలు, పట్టణాల్లో ఓట్లు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేకమంది వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల కోరిక మేరకు ఓటు వేసేందుకు   రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఎన్నికలు వాయిదా పడడంతో ప్రయాణం కూడా వాయిదా వేసుకోవాలని అప్పుడే స్థానిక నాయకుల నుంచి ఫోన్లు వెళ్లడంతో రిజర్వేషన్లను రద్దు చేసుకునే పనిలో ఉన్నారు. 

Updated Date - 2020-03-16T09:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising