ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్వర్జెన్సీ పనులు ప్రారంభించండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-01T04:55:32+05:30

ఉపాధి హామీ నిధులతో జిల్లాలో కన్వర్జెన్సీ పనులు సత్వరమే ప్రారంభించాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.

కలెక్టరేట్‌లో వినతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కలెక్టరేట్‌, నవంబరు 30 :  ఉపాధి హామీ నిధులతో జిల్లాలో కన్వర్జెన్సీ పనులు సత్వరమే ప్రారంభించాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.   ఇళ్లు, స్థలాలు, పింఛన్ల్లు , ఆరోగ్య శ్రీ, రైతు భరోసా వంటి సమస్యలపై  ప్రజల నుంచి  72 వినతులు స్వీకరించారు.  అనంతరం ఆయా శాఖాధికారులతో ఆయన సమీక్షిం చారు. జగనన్న పచ్చతోరణం నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రెండు రోజుల్లో శత శాతం లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.  జలసిరి కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు.  స్పందన కార్యక్రమంలోని వచ్చిన వినతులు 1200 వరకూ పెండింగ్‌లో ఉన్నాయని,  వీటిని వెంటనే పరిష్కరించాలని  ఆదేశించారు.   విభిన్న ప్రతిభావంతులు , వయోవృద్ధులకు సహాయ సంస్థ నుంచి జిల్లాకు కేటా యించిన నాలుగు శ్రవణ యంత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమానికి  వచ్చిన అర్జీదారులు గతంలో  రూ.10 భోజన సదుపాయం కల్పించేవారు. కొవిడ్‌ కారణంగా దాన్ని నిలిపివేశారు. తిరిగి సోమవారం భోజన కార్యక్రమం ప్రారం భించారు. సమావేశంలో జేసీ జె.వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, డీపీఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

   7 నుంచి ‘వ్యర్థాలపై యుద్ధం’

విజయనగరం (ఆంధ్రజ్యోతి):  జిల్లావ్యాప్తంగా ఈనెల 2 నుంచి జరగాల్సిన ‘వ్యర్థాలపై యుద్ధం’ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల ఏడో తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  7న జిల్లా స్థాయిలో, 8న మండల స్థాయి, 9నగ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,  ప్రజలు, రైతులు, ఎన్జీవోలతో నాలుగోరోజు నుంచి 15వ రోజు వరకూ ఈ కార్యక్రమాన్ని చేపడామని తెలిపారు. 21న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.  

 

 

Updated Date - 2020-12-01T04:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising