ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2020-05-27T09:28:45+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధులు నిర్వహించిన పోలీసు శాఖకు, ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సేవలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రాజకుమారి 


విజయనగరం క్రైం/కొత్తవలస, మే 26: లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధులు నిర్వహించిన పోలీసు శాఖకు, ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ రాజకుమారి కొనియాడారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆమె సన్మానించి ప్రశంసాపత్రాలు అంది ంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా వలసదారులకు రాత్రి, పగలు అని తేడా లేకుండా స్వచ్ఛంద సంస్థలు భోజనాలు అందించారన్నారు. ఎస్పీ అభినందించిన వారిలో గురాన అయ్యలు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గురాన అయ్యలు, ఎస్‌వీఎన్‌ ఆప్టికల్స్‌ అధినేత శ్రీనివాసరావు, గోల్డేన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ ప్రతినిధి కె.ఆర్‌.కె. రాజు, చందక సూరిబాబు, అనురాధ (బేగం), యాక్సిస్‌ బ్యాంకు, విజ యనగరం, మాల్వారీ హోమంచ్‌ ప్రతినిధులు ఉన్నారు.  కార్యక్రమంలో డీఎస్పీ వీరాంజనేయరెడ్డి,  పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


కానిస్టేబుల్‌కు ప్రశంసలు


మతిస్థిమితం లేని బాలుడికి సపర్యలు చేసిన కొత్త వలస పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ వై. సురేష్‌ను ఎస్పీ రాజకుమారి అభినందించారు. ‘పందుల మధ్యే బాలుడు.. అక్కున చేర్చుకున్న పోలీసు’ శీర్షికన ఆంధ్ర జ్యోతి మెయిన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు జిల్లా ఎస్పీ స్పందించారు. కొత్తవలస-శృంగవరపుకోట రోడ్డులో చెత్తకుప్పల్లో పందుల మధ్యే జీవనం సాగిస్తున్న  మతిస్థిమితం లేని 14 ఏళ్లబాలుడు గత నెల  రోజులుగా ఎండకు ఎండి, వానకు తడిసి ఆకలితో పస్తులుండడాన్ని చూసిన కానిస్టేబుల్‌ సురేష్‌ సీఐ జీ. గోవిందరావు  చొరవతో మంగళవారం స్నానం చేయించి, మంచి దుస్తులు ఇచ్చి బలిఘట్టాంలో నున్న హొయినా అనాఽథ ఆశ్రమంలో చేర్పించడంతో ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైంది. ఈమేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి సురేష్‌ తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కార్యాలయానికి మంగళవారం రప్పించారు. 1000 రూపాయలు నగదు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించి ప్రోత్సహించారు.

Updated Date - 2020-05-27T09:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising