ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడా.. 2000!

ABN, First Publish Date - 2020-03-16T10:09:39+05:30

చలామణిలో ఉన్న రూ.2000 నోటు అరుదుగా కనిపిస్తుంది. ఈ నోటు చలామణిలోకి వచ్చింది మొదలు ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం. ఈ నోటును రద్దు చేస్తారనే వదంతులు చాలాసార్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ నోటు ఆస్తిత్వంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇండియన్‌ బ్యాంక్‌ తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలామణిలో స్వల్పంగా కనిపిస్తున్న నోటు

బ్యాంకు ఏటీఎంల్లో ఎక్కువగా రూ.500 నోట్లే


(సాలూరు రూరల్‌)

చలామణిలో ఉన్న రూ.2000 నోటు అరుదుగా కనిపిస్తుంది. ఈ నోటు చలామణిలోకి వచ్చింది మొదలు ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం. ఈ నోటును రద్దు చేస్తారనే వదంతులు చాలాసార్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ నోటు ఆస్తిత్వంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇండియన్‌ బ్యాంక్‌ తన ఏటీఎంల్లో రూ.2000 నోట్లు ఉంచబోనని ప్రకటించడంతో ఈ నోటుపై ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇండియన్‌ బ్యాంకే కాదు వివిధ బ్యాంకుల ఏటీఎంల్లో వినియోగదారులకు రూ.500 నోట్లే అధికంగా వస్తున్నాయి. ఒకటి రెండు బ్యాంకుల ఏటీఎంల్లో మాత్రం అప్పుడప్పుడు రూ.2000 నోట్లు వస్తున్నాయి.


2016 వరకు చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను ఆ ఏడాది నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా వివిధ ఫీచర్లతో రూ.500 (ప్రస్తుతం చలామణిలో ఉన్నది) రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. రెండు వేల రూపాయల నోటుపై అప్పట్లో పలు వదంతులు వచ్చాయి. ఈ నోటులో మైక్రోచిప్‌ ఉందని, పెద్దమొత్తంలో ఎక్కడ దాచిన ఉపగ్రహం ద్వారా కనిపెట్టి వెలికితీయవచ్చునని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అటువంటిదేమి లేదని అప్పట్లో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


ఈ నోటు రద్దు చేస్తారనే మరో వదంతి ప్రచారం జరిగింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో రద్దు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నోటు రద్దు తదితర ప్రచారాలు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులు ఏటీఎంల్లో రూ.2000 నోట్లు కంటే రూ.500 నోట్లు అధికంగా వస్తుండడంతో ప్రజల్లో ఈ నోటుపై మళ్లీ అపోహలు మొదలయ్యాయి.


ఈ నోటును క్రమంగా వెనక్కి తీసుకునే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత రూ. 2000 నోట్లను ముద్రించారు. అప్పట్లో 3,542.991 మిలియన్‌ నోట్లను ముద్రించారు. 2017-18లో రూ.2000 నోట్ల ముద్రణను 111.507 మినియన్‌ నోట్లకు తగ్గించారు. 2018-19లో ఈ నోటు ముద్రణ కేవలం 46.690 మినియన్‌ నోట్లకు తగ్గించారు. ప్రస్తుతం ఈ నోట్ల ముద్రణను కొనసాగించడం లేదని తెలిసింది.


మార్కెట్‌లో రూ.2000 నోట్ల చలామణి సైతం చాలా తగ్గాయి. అక్రమ నిల్వ, బ్లాక్‌మనీ నిరోధానికి ఈ నోట్ల చలామణి తగ్గించే అవకాశం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూ.పది నాణేలు ప్రభుత్వం నిషేధించకుండానే చలామణిలో లేని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదే విధంగా రూ.2000 నోటు సైతం ప్రభుత్వం రద్దు చేయకుండానే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-03-16T10:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising