‘రైతుల సబ్సిడీపై చెక్ పెట్టేందుకే స్మార్ట్ మీటర్లు’
ABN, First Publish Date - 2020-09-14T09:25:46+05:30
రైతులకు ఇంతవరకు విద్యుత్‌పై అందజేస్తున్న రాయితీలకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ మీటర్లు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని వ్యవసాయ కార్మిక ..
గజపతినగరం: రైతులకు ఇంతవరకు విద్యుత్‌పై అందజేస్తున్న రాయితీలకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ మీటర్లు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక శాఖా గ్రంథాలయం ఆవరణలో ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమి టీ సభ్యులు రాకోటి రాములు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జీవో నెం.22ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.శ్రీను, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.లక్ష్మణ, ఆర్.హరికృష్ణవేణి, జె.కనకరాజు పాల్గొన్నారు.
నేడు జిల్లా వ్యాప్తంగా ఆందోళన
సాలూరు రూరల్: రైతుల పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు జారీ చేసిన జీవో నెం.22ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న జిల్లా వ్యాప్తంగా రైతులతో ఆందోళన నిర్వహించను న్నట్టు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షు డు ఎన్‌వై నాయుడు తెలిపారు. ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు నిర్వహించే ఆందోళనకు సీఐటీ యూ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు.
Updated Date - 2020-09-14T09:25:46+05:30 IST