స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించాలి
ABN, First Publish Date - 2020-05-06T11:11:10+05:30
ఉపాధి హామీ వేతనదారులు పని ప్రదేశాల్లో స్వీయ రక్ష ణా జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో సీహెచ్.సూర్యనారాయణ అన్నారు.
మక్కువ, మే 5: ఉపాధి హామీ వేతనదారులు పని ప్రదేశాల్లో స్వీయ రక్ష ణా జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో సీహెచ్.సూర్యనారాయణ అన్నారు. స్థాని క మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఉపాధి హామీ వేతనదారులకు శానిటైజర్లు, సబ్బులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నియంత్రణకు పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలన్నారు.
అలాగే గరిష్ట వేతనం రూ.237 పొందాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి ఏపీవో ఈశ్వరమ్మ పాల్గొన్నారు. ఫ తెర్లాం: ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు తప్పనిసరిగా భౌతిక దూ రం పాటించేలా చూడాలని ఏపీడీ లోకేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. మం గళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వ హించి సబ్బులను పంపిణీ చేశారు. ప్రతి 20 నిమిషాలకు చేతులు శుభ్రంగా కడుక్కోవా లన్నారు. ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో జగదీశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-06T11:11:10+05:30 IST