ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఆర్‌ కళాశాల పరిరక్షణకు వినతులు

ABN, First Publish Date - 2020-11-28T04:51:28+05:30

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన మహారాజా కళాశాల పరిరక్షణకు గాను ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ తెలిపారు.

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం దాసన్నపేట, నవంబరు 27: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి  చెందిన మహారాజా కళాశాల పరిరక్షణకు గాను ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ తెలిపారు.  శుక్రవారం ఎల్‌బీజీ భవనంలో  సురేష్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఇకపై ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉద్యమం చేయా లని కమిటీ నిర్ణయించిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో  మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు కలుస్తామని తెలిపారు. కళాశాలలో అడ్మి షన్లు ప్రారంభించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేస్తామన్నారు.  ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల  ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు. ఈ నెల 30న జిల్లా అధికారులను కలిసి వినతులను అందిస్తామన్నారు. అప్ప టికీ స్పందించకపోతే ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం చేసి ఒత్తిడి తెస్తా మని  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు రాము, రామ కృష్ణ, హరీష్‌, హర్ష పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-11-28T04:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising