ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లించాలని వినతి

ABN, First Publish Date - 2020-12-29T05:05:46+05:30

రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రోకు వినతిపత్రాన్ని అందజేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బేబీనాయన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి రూరల్‌: రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ  ఇన్‌చార్జి   బేబీనాయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో  తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రోకు వినతిపత్రాన్ని అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో గత 19 నెలల్లో 756మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది అత్యంత బాధాకరమని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుం బాలకు గత ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తే,  ప్రస్తుత ప్రభుత్వం  రూ.7 లక్షలకు పెంచినప్పటికీ క్షేత్ర స్థాయిలో కేవలం రూ.2 లక్షలు మాత్రమే అందిస్తుందని ఆరోపించారు. బీమా ప్రీమియం సకాలంలో చెల్లించడంలేదని, పంట పరిహారం ఆలస్యంగా అందుతోందని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ అల్లాడ భాస్కరరావు, టీడీపీ నాయకులు ఉన్నారు. 

 

 

Updated Date - 2020-12-29T05:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising