ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50 కోట్లతో రోడ్లకు మరమ్మతులు

ABN, First Publish Date - 2020-11-26T05:15:47+05:30

జిల్లాలో రూ.50 కోట్లతో రహదారుల మరమ్మతులకు ప్రతి పాదనలు పంపినట్టు ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (రెగ్యులర్‌) వీకే విజయశ్రీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం, నవంబరు 25:

జిల్లాలో రూ.50 కోట్లతో రహదారుల మరమ్మతులకు ప్రతి పాదనలు పంపినట్టు ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (రెగ్యులర్‌) వీకే విజయశ్రీ తెలిపారు. మండల కేంద్రంలోని సచివాలయం- 2లో ఆమె విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే చాలా రోడ్లకు ప్యాచ్‌ వర్కులు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో న్యూ డవలప్‌మెంట్‌ బ్యాంకు పథకంలో ఏడు రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపామని, వీటిలో సాలూరు, మక్కువ, తోటపల్లి, చీపురుపల్లి ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. గతప్రభుత్వ హయాంలో మంజూరైన సీతానగరం, పారాది బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మురిగిపోవడంతో కొత్తగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ స్పెషలాఫీసర్‌ విజయశ్రీ కోరారు. మండల కేంద్రంలో ఉన్న సచివాలయం-1,2లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. 

 

Updated Date - 2020-11-26T05:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising