ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయబద్ధంగా రాములోరి పట్టాభిషేకం

ABN, First Publish Date - 2020-04-04T11:11:29+05:30

రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 3:  రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం  శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానంలో నవమిని పురస్కరించుకుని గురువారం సీతారాముల కల్యాణోత్సవం జరిగిన సంగతి విదితమే.  దశమి సందర్భంగా శుక్రవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రాతఃకాలార్చన, బాలభోగం అయిన తర్వాత ముందుగా యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు.


తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామిని ఆహ్వానించి ప్రత్యేక అర్చనలు చేశాక పట్టాభిషేక సర్గ విన్నపం చేశారు. పంచామృత స్నపనం చేసి శ్రీరామచంద్రస్వామికి కిరీట ధారణ చేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులతో పాటు అర్చకులు కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, ప్రసాద్‌, పవన్‌కుమార్‌ తదితరులు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను దేవస్థానం ఈవో బీహెచ్‌ వీఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఈ కార్యక్రమానికి కూడా భక్తులకు అనుమతించలేదు. 

Updated Date - 2020-04-04T11:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising