ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

ABN, First Publish Date - 2020-09-23T11:19:38+05:30

వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బొబ్బిలి: వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సీఐటీయూ నాయకుడు పొట్నూరు శంకరరావు పిలుపునిచ్చారు. ఇందుకు సం బంఽధించిన కరపత్రాలను మంగళవారం పంపిణీ చేశారు.


నవ్యా జూట్‌మిల్లు ముందు  ఆయన మాట్లాడుతూ రూ.62 లక్షల కోట్ల  వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్రం యోచిస్తోందన్నారు.  ప్రజలంతా పెద్దఎత్తున తమ వ్యతిరేకతను తెలియజేయాలని కోరారు. ఆయన వెంట జూట్‌కార్మిక యూనియన్‌ అధ్యక్షుడు బీసీహెచ్‌ చిరంజీవులు, గణపతి, సత్యారావు ఉన్నారు.


 బొబ్బిలి రూరల్‌: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు,  వ్యవసాయ బిల్లుకు నిరసనగా ఈ నెల 25న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గోపాల్‌ కోరారు. సీహెచ్‌. బొడ్డవలస, వెంకటరాయుడుపేట, గోపాల రాయుడుపేటలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. వ్యవసాయ బిల్లు నిరసనలో అధిక సంఖ్యలో రైతులు, కార్మికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు.  

Updated Date - 2020-09-23T11:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising