దేవాలయాలపై దాడులకు నిరసన
ABN, First Publish Date - 2020-09-14T09:27:06+05:30
పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవా రి ఆలయంలో స్థానిక టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసన
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రముఖ ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 13: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవా రి ఆలయంలో స్థానిక టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు.ఫ గరివిడి: గరివిడిలోని సూర్యసదనంలో స్థానిక టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు పైల బలరాం, నేతలు పాల్గొన్నారు. ఫ నెల్లిమర్ల: టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ మండల నాయకులు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ రామతీర్థం రామస్వామి దేవస్థానం ఎదుట టీడీపీ నేత దంతులూరి శంకర సీతారామరాజు (సింగుబాబు), పార్టీ సీనియర్ నాయకుడు గేదెల రాజారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
సీబీఐ విచారణ స్వాగతిస్తున్నాం
కొత్తవలస: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్దం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తు న్నామని జిల్లా బ్రాహ్మణ పురోహిత అర్చక సమాఖ్య అధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు. విచారణను రెండు నెలలోనే పూర్తి చేసి దోషులను పట్టుకుని అరెస్టు చేయాలన్నారు.
అంతర్వేది ఘటన కారకులను శిక్షించాలి
కొత్తవలస రూరల్(ఎల్.కోట): ఇటీవల అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో రథం దగ్ధం కావడానికి కారకులైన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్ చేశారు. ఎల్.కోటలోని ఆమె నివాసంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో మట్లాడారు. స్వామివారి సేవలో 60 ఏళ్లపాటు ఉన్న రథం అగ్నికి ఆహుతికావడం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేబీఏ రామ్‌ప్రసాద్, నాయకులు సీహెచ్ మల్లునాయుడు, అక్కిరెడ్డి రమణ పాల్గొన్నారు.
పథకం ప్రకారమే దాడులు...
సాలూరు: రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారమే హిందూ ఆలయాలపై దాడులు చేస్తోందని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతి పక్ష ఉపనేత గుమ్మిడి సంధ్యా రాణి ఆరోపించారు. స్థానిక విలేకర్లతో ఆమె ఆదివా రం ఫోన్‌లో మాట్లాడారు. జగన్మో హన్‌రెడ్డి విధానాల వల్ల అంతర్వేదిలో రథం కాలి బూడిదయ్యిందని విమ ర్శించారు. హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న విధ్వంస ఘటనలు, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
నిరసన తెలిపే హక్కు లేదా?
విజయనగరం రూరల్: రాష్ట్రంలోని దేవాల యాలు, రథాలకు రక్షణ లేకుండా పోయిందని, దీనిపై నిరసన తెలిపే హక్కు లేదా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో మాట్లాడుతూ.. అంత ర్వేది ఘటనతో హిందువులు మనోవేదన చెందుతున్నారన్నారు. ఈ విష యమై హిందూ ఽథార్మిక సంస్థలు, పలు సంస్థల ప్రతినిధులు నిరసన తెలి పితే, వారిని ప్రభుత్వం అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
గజపతినగరం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాల యంలో విలేకర్ల సమవేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
Updated Date - 2020-09-14T09:27:06+05:30 IST