ఏనుగుల నుంచి రక్షణ కల్పించండి
ABN, First Publish Date - 2020-12-02T04:40:21+05:30
కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులతో రైతుల ప్రాణాలకు, పంటలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన రైతులు భయం లేకుండా జీవనం సాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ జగదీష్
పార్వతీపురం, డిసెంబరు 1 : కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులతో రైతుల ప్రాణాలకు, పంటలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన రైతులు భయం లేకుండా జీవనం సాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలిలో మంగళవారం మాట్లాడుతూ ఏనుగుల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఏనుగులను శాశ్వతంగా ఈ ప్రాంతం నుంచి తరలించడం లేదా ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేసి పంటలు, గిరిజనుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఏనుగులు పంటలను అధికంగా ధ్వంసం చేస్తున్నాయని, అధికారులు నష్టపరిహారం చాలా తక్కువగా ఇస్తున్నారని ప్రస్తావించారు. రైతు పంటపై పెట్టిన పెట్టుబడిలో కేవలం 25 శాతం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఎమ్మెల్సీ కోరారు.
Updated Date - 2020-12-02T04:40:21+05:30 IST