ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరిగేషన్‌ పనులకు ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2020-09-20T11:07:12+05:30

బొబ్బిలి సర్కిల్‌ పరిధిలో రూ.40 కోట్లతో 169 మైనర్‌ ఇరిగేషన్‌ పనులకు ట్రిపుల్‌ ఆర్‌ కింద ప్రతిపాదనలు పంపినట్లు సూపరింటెండెంట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, సెప్టెంబరు 19: బొబ్బిలి సర్కిల్‌ పరిధిలో రూ.40 కోట్లతో 169 మైనర్‌ ఇరిగేషన్‌ పనులకు ట్రిపుల్‌ ఆర్‌ కింద ప్రతిపాదనలు పంపినట్లు సూపరింటెండెంట్‌ ఇంజినీరు ఎన్‌.రాంబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రిపైర్స్‌, రెస్టోరేషన్‌, రెన్నెవేషన్‌ కోసం సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి పాదనలు కోరినట్లు చెప్పారు. జిల్లాలో మైనస్‌ 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం లోటులో ఉందన్నారు.


జూన్‌ 1 నుంచి ఇంతవరకు 529.88 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే నమోదు అయిందన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిధిలో శివారు భూములకు సాగునీరందించలేకపోతున్నామని చెప్పారు. ఆయ కట్టుదారులంతా వరిని మాత్రమే సాగుచేస్తుండడంతో నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.  జలాశయాల నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసినప్పుడు తొలుత శివారు భూములకు నేరుగా నీరందించాలన్న యోచన ఉంద న్నారు.


దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఐదు మీడి యం ప్రాజెక్టుల పరిధిలో 71,383 ఎకరాలు, మైనర్‌ ఇరిగేషన్‌ కింద 1,11,267 ఎకరాల ఆయకట్టు భూములు ,  350 చెరువులు ఉన్నాయన్నారు. రూ.38 కోటతో పెద్దగెడ్డ ఆధునికీకరణ పనులకు రీటెండరు పిలుస్తున్నామన్నారు. పెదంకలాం, వీఆర్‌ఎస్‌ టెండర్లు సీఈ కార్యాలయంలో ఉన్నాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-20T11:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising