ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండా పండగకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2020-08-15T11:44:37+05:30

స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికోసం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పంద్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌

జాతీయ జెండాను ఆవిష్కరించనున్న                                                జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి

కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు


కలెక్టరేట్‌, ఆగస్టు 14:  స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికోసం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.


గౌరవ వందనం స్వీరించనున్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్‌, శకటాలు వంటి ప్రదర్శనతో పాటు ఏటా ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే పురస్కారాలను సైతం నిలిపివేశారు. ఒక్క కొవిడ్‌ స్టాల్‌ను మాత్రం ప్రదర్శించనున్నారు. కొవిడ్‌ విధుల్లో సేవలందించిన 72 మంది  వైద్య, ఆరోగ్య, పోలీసు, పారిశుఽధ్య సిబ్బందితో పాటు వైరస్‌  నుంచి రికవరీ అయిన పది మందిని సన్మానించనున్నారు.


కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిచ్చారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు.

Updated Date - 2020-08-15T11:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising