ప్రవేశ పరీక్ష వాయిదా
ABN, First Publish Date - 2020-03-27T11:26:44+05:30
జిల్లాలోని పాచిపెంట మండలంలో కొటికిపెంట (సరాయివలస), కురుపాం (పార్వతీపురం), అనసభద్ర
పార్వతీపురం, మార్చి 26 : జిల్లాలోని పాచిపెంట మండలంలో కొటికిపెంట (సరాయివలస), కురుపాం (పార్వతీపురం), అనసభద్ర (వైఎస్ వలస), భద్రగిరి, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 29న జరగవలసిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ గిరిజన విద్యావాఖ ఉప సంచాలకులు కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు, తదితర తరగతులకు సంబంధించి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తరువాత తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-03-27T11:26:44+05:30 IST