పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచండి
ABN, First Publish Date - 2020-12-12T05:22:23+05:30
విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని అధికారులు, సిబ్బందికి విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముంగిపు వేడుకలకు డీఐజీ హాజరయ్యారు.
విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు
విజయనగరం క్రైం, డిసెంబరు 11:
విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని అధికారులు, సిబ్బందికి విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముంగిపు వేడుకలకు డీఐజీ హాజరయ్యారు. మూడు జిల్లాలకు చెందిన 61 మంది అధికారులు, సిబ్బంది మీట్‌కు హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన వారికి డీఐజీ చేతులమీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు అందించారు. పోలీస్ డ్యూటీ మీట్‌ను ఏర్పాటుచేసిన ఎస్పీ రాజకుమారిని అభినందించారు. వృత్తిపరమైన అంశాలను అధిగమించేందుకు డ్యూటీ మీట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ డీఐజీ రంగారావు ఇచ్చిన స్ఫూర్తితోనే మంచి కార్యక్రమాన్ని నిర్వహించగలిగామని చెప్పారు. కార్యక్రమంలో విశాఖ ఎస్‌ఈబీ ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్, శ్రీకాకుళం ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, విశాఖ ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, ఏఎస్‌పీ శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:22:23+05:30 IST