ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో విధులు నిర్వహించండి

ABN, First Publish Date - 2020-03-16T10:18:44+05:30

ఎన్నికల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు శిక్షణ


పార్వతీపురం, మార్చి 15: ఎన్నికల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ మనస్తత్వం కలిగిన ఓటర్లు ఉంటారని, అధికారులు సహనంతో వారికి ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన విధంగా సమయపాలన పాటించాలని తెలిపారు.


ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్‌ అధికారులపైనే ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, జిల్లా పంచాయతీ అధికారి సునీల్‌రాజ్‌కుమార్‌, సీపీవో విజయలక్ష్మి, పార్వతీపురం డివిజనల్‌ పంచాయతీ అధికారి సాయినాథ్‌, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T10:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising