ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణం తీరే దారేది?

ABN, First Publish Date - 2020-06-05T10:07:30+05:30

కరోనా కష్టకాలంలో పూట గడవడానికే ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు డ్వాక్రా రుణాల వాయిదాలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డ్వాక్రా మహిళలకు ఆర్థిక ఇబ్బందులు

రుణాలు చెల్లించాలని ఒత్తిడి

 ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్న వైనం

వెంటాడుతున్న అధిక వడ్డీల భయం


(పార్వతీపురం): కరోనా కష్టకాలంలో పూట గడవడానికే ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు డ్వాక్రా రుణాల వాయిదాలు చెల్లించాల్సి రావడం మరింత కష్టంగా మారింది. ఈ రుణాలకు సంబంధించి బ్యాంకు వాయిదాలపై ప్రభుత్వం మూడు నెలల పాటు మారటోరియం విధించినప్పటికీ మహిళా సంఘాల ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో పరువు పోతుందనే ఆవేదనతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదాలు చెల్లిస్తున్నామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పనుల్లేక అనేక పేద కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి.


ఉపాధి లేక విలవిల్లాడుతున్నాయి. కుటుంబ పోషణ కష్టమవుతుండడంతో అలవాటు లేని ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కుటుంబాలు కోకొల్లలు. భార్యా భర్తలిద్దరూ చెరువు పనులకు వెళ్తున్నారు. డ్వాక్రా రుణాలు తీసుకున్న కుటుంబాలు ప్రతి నెలా  వాయిదాలు చెల్లించాల్సి ఉంటోంది. ప్రభుత్వం రుణాలపై మారటోరియం ఉందని చెబుతున్నప్పటికీ స్థానిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రూపు అధ్యక్షులు ఒత్తిడి తెస్తున్నారు. రుణాలు చెల్లించాలని, మధ్యలో విరామం ఇస్తే భవిష్యత్‌లో గ్రూపు సభ్యులందరికీ ఇబ్బంది ఎదురవుతుందని, రుణాలు ఇవ్వడం తగ్గిపోతుందని చెబుతున్నారు.


దీంతో చేసేది లేక చేతిలో డబ్బుల్లేకపోయినా అప్పు చేసి వాయిదాలు చెల్లిస్తున్నారు. కొందరు మాత్రం ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన కూలి డబ్బులు మిగుల్చుకుని ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం, మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాల్లో 4,635 మహిళా సంఘాలకు సుమారు రూ. 102 కోట్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.


అంతకుమించి 4,762 మహిళా సంఘాలకు రూ. 111.52 కోట్లను అందించారు. వీటికి సంబంధించి వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం కొన్ని సంఘాల్లో మహిళలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మైదాన ప్రాంత మండలాల్లోనూ అనేక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలను పొందాయి. వాయిదాలు చెల్లించేందుకు నేడు ఇబ్బందులు పడుతున్నాయి. 


ఒత్తిడి చేయడం లేదు..మోహనరావు, బ్యాంకు లింకేజీ డీపీఎం, పార్వతీపురం

బ్యాంకు రుణం వాయిదాల కోసం సంఘాలపై ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రభుత్వం తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది. వాయిదాలను భవిష్యత్తులోనైనా చెల్లించాలి. రికవరీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి.


Updated Date - 2020-06-05T10:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising