ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు రూ.10 వేలు అడ్వాన్స్‌ చెల్లించండి

ABN, First Publish Date - 2020-12-27T05:32:13+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికే మాత్రమే పరిమితం కావడం వల్ల సంక్రాంతికి అడ్వాన్స్‌గా రూ. 10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యం కొనుగోలులో జాప్యం ప్రభుత్వ నిర్లక్ష్యమే: ఎమ్మెల్సీ జగదీష్‌

పార్వతీపురం, డిసెంబరు 26: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికే మాత్రమే పరిమితం కావడం వల్ల సంక్రాంతికి అడ్వాన్స్‌గా రూ. 10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో వీరు విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం దారుణమని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక సమ స్యలు ఎదుర్కొంటున్నారని, ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడం వల్ల  సం క్రాంతి పండగకు చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. మోటార్లకు మీటర్లతో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం మొండిగా మోటా ర్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు. జిల్లాలో రైతులందరికీ ఖాళీ గోనె సంచులు ఇచ్చి రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు కోలా వెంకటరావు, బడే గౌరునాయుడు, దొగ్గ మోహన్‌, గొంగాడ రామ్మూర్తి, తాన్న తిరుపతి, జాగాన రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising