ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడు కాదు!.. గిరిజనులకు పట్టాల పంపిణీ వాయిదా

ABN, First Publish Date - 2020-08-09T17:48:24+05:30

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పెద్ద ఎత్తున..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్టోబరు 2న పంపిణీకి సన్నాహాలు


పార్వతీపురం(విజయనగరం): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పెద్ద ఎత్తున భూహక్కు పట్టాలు అందిస్తామని కొన్ని నెలలుగా ప్రభుత్వం చెప్పుకొస్తోంది.  తాజాగా ఈ కార్యాక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ వాయిదా వేసింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమకు పట్టాలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గిరిజనులు ఈ  ప్రకటనతో నిరాశకు గురయ్యారు. పార్వతీపురం డివిజన్‌లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పథకం కింద 6,287 కుటుంబాలకు 7,230 ఎకరాల అటవీ భూమికి పట్టాలు ఇవ్వనున్నట్టు, 6 వేల మంది గిరిజనులకు 6,188 ఎకరాల భూమికి డీకేటీ పట్టాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇటీవల ప్రకటించారు. ఈ నెల 9న (ఆదివారం) ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయడానికి అధికారులు ముహూర్తం నిర్ణయించారు. తాజాగా కరోనా కారణంగా అక్టోబరు 2వ తేదీకి వాయిదా వేశారు.


Updated Date - 2020-08-09T17:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising