ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్ష సాధింపు చర్యలు తగవు

ABN, First Publish Date - 2020-12-16T05:23:40+05:30

టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు తగవని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చింతలపేట గ్రామాన్ని మంగళవారం సందర్శించారు.

చింతలపేటలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గుర్ల, డిసెంబరు 15: టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు తగవని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.  చింతలపేట గ్రామాన్ని మంగళవారం సందర్శించారు.  గ్రామకంఠంపై జరిగిన వివాదాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ...  పూర్వీకుల నుంచి గ్రామస్థుల ఆధీనంలో ఉన్న భూమిని లాక్కోవడం దారుణమన్నారు.   ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం  మానుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా గ్రామానికి వైసీపీ నాయకులు  పతివాడ భాస్కరరావు, రామునాయుడు మహిళలతో కలిసి వెళ్లి నాగార్జున కారును ఆపారు. ఈ ప్రాంతంలో  కొందరు టీడీపీ నేతలు పేదల కు పథకాలు అందకుండా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.   పోలీసులు సమక్షంలో దేశం నేతల కారులను పంపించారు.    గుర్ల, గరివిడి, చీపురుపల్లి పార్టీ నేతలు సన్యాసినాయుడు, కిరణ్‌కుమార్‌, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


 

 

Updated Date - 2020-12-16T05:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising