ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2020-11-03T05:42:05+05:30

పైడిమాంబ తెప్పోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు.

ట్రయల్‌ రన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు పైడిమాంబ తెప్పోత్సవం 

విజయనగరం రూరల్‌, నవంబరు 2:

పైడిమాంబ తెప్పోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. ఈ మేరకు దేవస్థానం,  రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపకశాఖల అధికారులు సోమవారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. పెద్దచెరువు వెనుకభాగాన (రైల్వే స్టేషన రోడ్డులో పైడిమాంబ వనంగుడి వెనుక)  ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడి నుంచే తెప్పోత్సవాన్ని వీక్షించాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు వనంగుడి వద్ద పురోహితుల ఆధ్వర్యంలో వేద సభ జరుగుతుంది. 4.45 గంటలకు వేదసభ నిర్వహించే వారికి సన్మానం అనంతరం.. తెప్పోత్సవానికి పైడిమాంబను సిద్ధం చేస్తారు. ఉత్సవ విగ్రహాన్ని వనంగుడి నుంచి పెద్ద చెరువు ప్రాంగణానికి తీసుకెళ్లేందుకు వీలుగా ఒక వాహనాన్ని, పైడిమాంబను ప్రత్యేకంగా అలంకరించేందుకు వివిధ రకాల పూలను సిద్ధం చేశారు.  కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం పైడిమాంబ కోసం మాత్రమే ఒక బోటును సిద్ధం చేశారు. అందులో  అర్చకులు, అధికారులు పది మంది మాత్రేమే ఉంటారు. మిగతా వారంతా బయటి నుంచే వీక్షించాల్సి ఉంటుంది. తెప్సోత్సవానికి హాజరయ్యేవారు భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని  ఆలయ ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. 

 ట్రయల్‌ రన విజయవంతం 

తెప్పోత్సవానికి ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పెద్దచెరువులో నిర్వహించిన ట్రయల్‌ రన విజయవంతమైంది. ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం, వనటౌన, టూటౌన పోలీసులు, రెవెన్యూ విభాగం అధికారులు దేవదాయశాఖ,  అగ్నిమాపక శాఖాధికారులు ఈ ట్రయల్‌ రనను పరిశీలించారు.


 


Updated Date - 2020-11-03T05:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising