ఇ-పాస్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
ABN, First Publish Date - 2020-05-11T10:56:31+05:30
జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని
విజయనగరం క్రైం, మే 10 : జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇ-పాస్ మంజూరు కోసం ఈ నెంబర్‌కు 6309898989 వాట్సాప్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తన కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి డీజీపీ కార్యాలయంలో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు హెచ్‌టీటీపీః//సర్వీస్‌ఆన్‌లైన్.జీవోవీ .ఇన్/ఇపాస్/ను సంప్రదించాలని సూచించారు.
ఈ వెబ్‌సైట్‌లో ప్రయాణించే వ్యక్తి పూర్తి పేరు, ఫంక్షన్ నంబరు, ఫొటో , గుర్తింపు కార్డుగా డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డులను పొందుపొర్చాలని తెలిపారు. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారన్న విషయాన్ని , ప్రయాణానికి గల కారణాలను, వాహనం వివరాలను తెలియజేయాలని చెప్పారు. డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే ఎస్పీ నుంచి క్యూఆర్‌కోడ్‌తో పర్మిషన్ మంజూరవుతుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి డీజీపీ కార్యాలయం నుంచే అనుమతులు మంజూరవుతాయని తెలిపారు.
Updated Date - 2020-05-11T10:56:31+05:30 IST