ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమ తెరలు వచ్చేశాయ్‌

ABN, First Publish Date - 2020-11-12T04:38:03+05:30

దోమ తెరలు జిల్లాకు చేరుకున్నాయి. త్వరలోనే వాటిని పంపిణీ చేయనున్నారు. మలేరియా నివారణలో భాగంగా ..దోమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏటా వీటిని అధికారులు పంపిణీ చేస్తుంటారు. 2012 నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ తెరలను తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేస్తున్నాయి.

కొత్తగా వచ్చిన దోమ తెరలను వైటీసీలో భద్రపరుస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో గ్రామాల్లో పంపిణీ

 (పార్వతీపురం)

దోమ తెరలు జిల్లాకు చేరుకున్నాయి. త్వరలోనే వాటిని పంపిణీ చేయనున్నారు. మలేరియా నివారణలో భాగంగా ..దోమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏటా వీటిని అధికారులు పంపిణీ చేస్తుంటారు. 2012 నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ తెరలను తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేస్తున్నాయి. దోమ తెరలను సద్వినియోగం చేసుకుంటే మలేరియా బారినపడకుండా ఉండవచ్చు. కొంతమంది దోమ తెరలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల వాటిని సక్రమంగా వినియోగించడం లేదు. 2012లో 1.42 లక్షలు... 2016లో 72,800..., 2017లో 3,82,200 దోమ తెరలు పంపిణీ చేశారు. తాజాగా 4,42,488 దోమ తెరలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని సబ్‌ప్లాన్‌ మండలాలతో పాటు మెంటాడ మండలంలోని మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పురపాలక సంఘాల్లో కూడా దోమ తెరలు పంపిణీ చేస్తే ప్రజలకు మేలని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కేవలం ఎస్టీ సామాజిక వర్గానికి మాత్రమే పట్టణాల్లో దోమ తెరలు పంపిణీ చేశారు. 

త్వరలోనే పంపిణీ

మలేరియా శాఖకు వచ్చిన దోమ తెరల పంపిణీ కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది. తెరలను సద్వినియోగం చేసుకుని మలేరియా నివారణకు ప్రజలు సహకరించాలి.

                                        - ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో, పార్వతీపురం


Updated Date - 2020-11-12T04:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising