ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో మెగా వైద్య శిబిరం రేపు

ABN, First Publish Date - 2020-03-16T10:08:24+05:30

ఆర్యవైశ్య ఉద్యోగులు, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న మంగళవారం పట్టణంలోని మెగా వైద్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రింగురోడ్డు, మార్చి 15 : ఆర్యవైశ్య ఉద్యోగులు, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న మంగళవారం పట్టణంలోని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని కోలగట్ల వారి వీధిలో గల ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని రింగురోడ్డు సాయిబాబా ఆలయం జంక్షన్‌లో పెట్రోల్‌ బంకు ఎదురుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.


చిన్న పిల్లల వైద్య నిపుణులు కేవీ రమణమూర్తి, బి.అశోక్‌బాబు, జనరల్‌ వైద్య నిపుణులు కె.వసుధ, వి.అశోక్‌, ఎముకల వైద్య నిపుణులు ఎ.శ్రీరామ్మూర్తి, దంత వైద్య నిపుణులు దినేష్‌కుమార్‌, స్త్రీ వైద్య నిపుణులు టి.విచిత్ర, శస్త్ర చికిత్స నిపుణులు సింధూరి ఈ శిబిరంలో పాల్గొని వైద్యసేవలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘ కార్యదర్శి పాక సత్యనారాయణ, పెంటపాటి ముత్యాలరావు, పువ్వాడ శ్రీహరి, పీజే మహేష్‌, కిశార్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T10:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising