ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాది విశేష పాత్ర

ABN, First Publish Date - 2020-04-21T06:18:27+05:30

కరోనా వైరస్‌ ప్రబలకుండా అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ఎనలేనిదని ఎస్పీ రాజకుమారి అన్నారు. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులతో ఆమె సోమవారం ప్రత్యేకంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అక్రిడిటేషన్‌ , సంస్థ గుర్తింపుకార్డులు ఉంటే అనుమతి 
  • వారితో అనుచితంగా వ్యవహరించొద్దు
  • ఎస్పీ రాజకుమారి

విజయనగరం క్రైమ్‌, ఏప్రిల్‌ 20 : కరోనా వైరస్‌ ప్రబలకుండా అవగాహన కల్పించడంలో మీడియా  పాత్ర ఎనలేనిదని ఎస్పీ రాజకుమారి అన్నారు. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులతో ఆమె సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా ప్రబలకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని అభినందించారు. కొవిడ్‌-19 వైరస్‌కు భయపడకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లా తెగువ చూపుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో మీడియా ప్రతినిధులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని... వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించానని చెప్పారు. మీడియా సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డుతో పాటు అక్రిడిటేషన్‌ కార్డు, డీఆర్‌వో ఇచ్చిన కొవిడ్‌ గుర్తింపు కార్డులో ఏది చూపినా అనుమతించాలని ఆధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు.


పట్టణంలోని ముఖ్య కూడళ్లలో వివిధ శాఖలకు చెందిన ఎక్సైజ్‌, ఆటవీ, తూనికలు కొలతలు, ఎఆర్‌, ఎస్టీఎఫ్‌, సిఐడీ, ఏసీబీ వంటి విభాగాల సిబ్బంది కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్నారని, మీడియా ప్రతినిధులతో వారికి పరిచయాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇకపై జర్నలిస్టులకు ఎటువంటి  ఇబ్బందులు, అవాంతరాలు లేకుండా పైస్థాయి నుంచి హోంగార్డు వరకు తప్పనిసరిగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఏదైనా సమస్య వస్తే విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి ఫోన్‌ నంబర్‌ 9121109403కు సమచారం అందించవచ్చని ఎస్పీ రాజకుమారి సూచించారు.


Updated Date - 2020-04-21T06:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising