ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సక్రమంగా రికార్డుల నిర్వహణ

ABN, First Publish Date - 2020-06-18T11:28:07+05:30

కొత్తవలస గ్రామసచివాలయంలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి సునీల్‌ రాజ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సక్రమంగా రికార్డుల నిర్వహణ 


కొత్తవలస, జూన్‌ 17: కొత్తవలస గ్రామసచివాలయంలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి సునీల్‌ రాజ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా సచివాలయాల పర్యవేక్షణాధికారి విజయలక్ష్మితో కలసి కొత్తవలస గ్రామ సచివాలయాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది పని తీరు కూడా బాగాలేదని, సిబ్బంది తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉన్నందునప్రతి పంచాయతీలోనూ నూటికి నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసే విధంగా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు చేయడంలో శ్రద్ధ వహించాలన్నారు. కొత్తవలస పంచాయతీలో పారిశుధ్య పనులకే ఎక్కువ ఖర్చు అవుతోందని, అవసరమై నిధులు సమకూరడం లేనందున నిర్వహణ భారం ఎక్కువగా ఉంటోందన్నారు. 

Updated Date - 2020-06-18T11:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising