కేంద్ర విధానాలతో నష్టం..
ABN, First Publish Date - 2020-11-14T05:03:33+05:30
కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశా నికి తీవ్ర నష్టం కలుగుతోందని సీపీఎం పార్వతీపురం ప్రాంత జిల్లా కార్య దర్శి ఆర్. శ్రీరామ్మూర్తి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ, 25వ వార్డుల కు చెందిన బొగ్గుల వీధిలో ప్రజావ్యతిరే విధానాలను నిరసిస్తూ మాజీ కౌన్సిలర్ పాకల సన్యాసిరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మాట్లాడా రు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వివిధ సంఘాల నేతల ప్రచారం
అధికారులకు నోటీసులు అందజేత
పార్వతీపురంటౌన్, నవంబరు 13: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశా నికి తీవ్ర నష్టం కలుగుతోందని సీపీఎం పార్వతీపురం ప్రాంత జిల్లా కార్య దర్శి ఆర్. శ్రీరామ్మూర్తి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ, 25వ వార్డుల కు చెందిన బొగ్గుల వీధిలో ప్రజావ్యతిరే విధానాలను నిరసిస్తూ మాజీ కౌన్సిలర్ పాకల సన్యాసిరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మాట్లాడా రు. కార్మికులు, రైతులు, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసే విధానాలను టీడీపీ, వైసీపీలు బలపరచడం బాధాకరమన్నారు. ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు జీవీ రమణ, సూరిబాబు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 26నఒక్కరోజు సమ్మెలో పాల్గొంటున్నట్టు కొత్తవలస ప్రాజక్టు పరిధిలోని అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె నోటీసును పీవోకు ఇచ్చారు. శుక్ర వారం కొత్తవలసలో ప్రాజక్టు కార్యాలయంలో సమ్మె నోటీసును అందజేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం ప్రతినిధులు కె.వెంకటలక్ష్మి, జీ.శ్రీదేవి, సీఐటీయూ నాయకులు గాడి అప్పారావు, డేగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస రూరల్(ఎల్.కోట): ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎల్.కోట పీహెచ్‌సీ వైద్యాధికారికి ఆశావర్కర్ల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మెనోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు గాడి అప్పారావు, తరణి వెంకటరమణ, డేగల అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు మద్దతునిచ్చి సహకరించాలని కోరారు.
Updated Date - 2020-11-14T05:03:33+05:30 IST