ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కేసులు

ABN, First Publish Date - 2020-04-08T12:14:44+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిం దని, దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరిహద్దు జిల్లాల నుంచి ఎవరినీ రానీయవద్దు

ఎస్పీ రాజకుమారి 


విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 7: జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిం దని, దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. మంగళవారం లాక్‌డౌన్‌ అమలు తీరుపై ఎత్తుబ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ రైతు బజారు, కలెక్టరేట్‌ జంక్షన్‌, అంబేడ్కర్‌ కూడలి, న్యూ పూర్ణ తదితర ప్రాంతాలను ఆమె పర్యటించి పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న వారికి ఎండలో నిలబెట్టి ప్లకార్డులు పట్టించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరి స్తామన్నారు. ఇతర జిల్లాల వారు మన జిల్లాలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, సీఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారన్నారు. కరోనా నివా రణపై  పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సేవా కార్య క్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎం. మోహనరావు, ఎల్‌.శేషాద్రి, సీఐలు ఎర్రంనాయుడు, శ్రీహరిరాజు, రమేష్‌, వెంకటరావు, కాంతారావు, లక్ష్మణ రావు, సిబ్బంది పాల్గొన్నారు.


హోంగార్డులకు నిత్యావసర సరుకుల పంపిణీ

జిల్లాలో పనిచేస్తున్న 600 మంది హోంగార్డులు, ఔట్‌సోర్సింగు ఉద్యోగులకు ఎస్పీ రాజ కుమారి మంగళవారం నిత్యావసర సరుకులను పం పిణీ చేశారు. ఒక్కో ఉద్యోగికి ఐదు కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీదేవిరావు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకులు అందించిన ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, కొత్తవలస సీఐ గోవిందరావులకు హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పడగల బంగా ర్రాజు తదితరులు అభినందించారు. 


Updated Date - 2020-04-08T12:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising