ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులకు రుణాలు

ABN, First Publish Date - 2020-08-12T10:21:14+05:30

కొవిడ్‌-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఆర్థిక సాయం అందించేందుకు రుణాలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస, ఆగస్టు 11: కొవిడ్‌-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఆర్థిక సాయం అందించేందుకు రుణాలను అందిస్తుందని కొత్తవలస న్యాయవాద సంఘం అధ్యక్షుడు నందిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సొమ్మునుంచి న్యాయవాదులకు రుణాలను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.


న్యాయవాదులు ప్రాక్టీసులోకి వచ్చి ఐదేళ్లలోపు సీనియారిటీ కలిగిన వారికి రూ.10 వేల చొప్పున,  ఐదేళ్ల పైబడిన న్యాయవాదులకు రూ.20 వేల చొప్పున రుణాలు అందిస్తామని తెలిపారు. రూ.10 వేల రుణం తీసుకున్నవారు నెలకు రూ.522 చొప్పున 20 వాయిదాలలో  తిరిగి సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.20 వేల రుణం తీసుకున్న వారు నెలకు రూ.1040 చొప్పున 20 వాయిదాలలో తిరిగి చెల్లించాలని తెలిపారు. రుణం కావలసిన న్యాయవాదులు ప్రతి కోర్టులోని న్యాయవాద సంఘాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2020-08-12T10:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising