ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన హక్కుల సాధనకు పోరాడదాం

ABN, First Publish Date - 2020-12-14T05:25:57+05:30

గిరిజనుల హక్కులను సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆదివాసీ సంఘ నాయకులు తెలిపారు. ఆదివారం కోమట్లపేట వద్ద గిరిజన, ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది.

మాట్లాడుతున్న గిరిజన సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరాడ : గిరిజనుల హక్కులను సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆదివాసీ సంఘ నాయకులు తెలిపారు. ఆదివారం కోమట్లపేట వద్ద గిరిజన, ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లో 1496 ఏజెన్సీ గిరిజన గ్రామాలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం కొంతమందికే ఎస్టీ ధ్రువ పత్రాలు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో మిగిలినవారికి తీవ్ర అన్యాయం జరుగు తుందన్నారు. ఇప్పటికే సాలూరు మండలం బగ్గుదొరవలసలో ఏపీఎస్‌ఏఏఎస్‌ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు జరుగుతున్నాయని, వారికి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంగాధర్‌, తమ్మయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

‘చలో పెదమేరంగి’ విజయవంతం చేయండి

గిరిజనుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22న తల పెట్టిన చలో పెదమేరంగి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమరాడలో ఆదివారం  వాల్‌ పోస్టర్లు విడుదల చేశారు. పెదమేరింగిలో చేపట్టనున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని సీపీఎం నాయకులు సాంబమూర్తి అన్నారు. 


Updated Date - 2020-12-14T05:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising