ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వే బేస్‌ స్టేషన్లుగా శృంగవరపుకోట, గుమ్మలక్ష్మీపురం

ABN, First Publish Date - 2020-12-12T05:19:56+05:30

భూముల రీ సర్వేకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేకు సంబంధించి బేస్‌ స్టేషన్లుగా శృంగవరపుకోట, గుమ్మలక్ష్మీపురం మండలాలను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మన జిల్లాకు సంబంధించి ఈ రెండు మండలాలను ఎంపిక చేసినట్టు సర్వే అధికారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఎంపిక చేసిన సర్వే అధికారులు

 (శృంగవరపుకోట)

భూముల రీ సర్వేకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేకు సంబంధించి బేస్‌ స్టేషన్లుగా శృంగవరపుకోట, గుమ్మలక్ష్మీపురం మండలాలను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మన జిల్లాకు సంబంధించి ఈ రెండు మండలాలను ఎంపిక చేసినట్టు సర్వే అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సర్వే ఉన్నతాధికారులు, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఇక్కడి కొలతలను ప్రామాణికంగా చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి పరికరాలను తహసీల్దారు కార్యాలయాల్లో అమర్చనున్నారు. కార్స్‌ టెక్నాలజీ, డ్రోన్లు, రోపర్లు వంటి ఆధునిక పరికరాలను సర్వేకు వినియోగించనున్నారు. 


14 నుంచి గ్రామాల వారీగా సదస్సులు

తొలి విడత సర్వే ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. రైతుల్లో అపోహలు, భయాన్ని పోగొట్టేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకూ రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల సర్వేయర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దీంతో వీరంతా రెవెన్యూ గ్రామాల వారిగా అవగాహన సదస్సులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. భూముల రీ సర్వేకు సంబంధించి రైతులు వ్యక్తం చేసే అనుమానాలను నివృత్తి చేస్తారు.  చాలా గ్రామాల్లో రెవెన్యూ భూములు సబ్‌ డివిజన్లు కాలేదు. క్రయ విక్రయాలు ద్వారా భూముల మధ్య గట్లు వెలిశాయి. ఎవరికి వారే హద్దులు పెట్టుకోని రాళ్లు పాతుకున్నారు. ఇవేవీ రికార్డులకు ఎక్కలేదు. క్షేత్రస్థాయిలో భూముల కొలతల సమయంలో రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సబ్‌ డివిజనలు చేసి ఎవరికి భూమి వారికి చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. 



Updated Date - 2020-12-12T05:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising