ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్వతీపురం ఐటీడీఏ పీఓగా కూర్మనాథ్‌

ABN, First Publish Date - 2020-08-13T09:55:25+05:30

ప్రభుత్వం భారీగా డెప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మన జిల్లాలోనే నలుగురు అధికారుల బదిలీ అయ్యారు. జేసీ-2 (ఆసరా)గా పనిచేస్తున్న రోణంకి కూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌ఓ వెంకటరావు జేసీగా నియామకం

డీఆర్‌ఓగా ఎస్‌డీసీ గణపతిరావు 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/పార్వతీపురం

 ప్రభుత్వం భారీగా డెప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మన జిల్లాలోనే నలుగురు అధికారుల బదిలీ అయ్యారు. జేసీ-2 (ఆసరా)గా పనిచేస్తున్న రోణంకి కూర్మనాఽథ్‌ను పార్వతీపురం ఐటీడీఏ పీఓగా నియమించారు. ఆయన ఇదివరకు ఐటీడీఏలో కొద్ది నెలలు పరిపాలనా అధికారిగా పనిచేశారు. తాజాగా అదే ఐటీడీఏ పీఓగా నియమితులయ్యారు.  జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న జల్లేపల్లి వెంకటరావు జేసీ-2 (ఆసరా)గా బదిలీ అయ్యారు.


సుమారు రెండేళ్లుగా ఆయన డీఆర్‌ఓగా పని చేస్తున్నారు. ఆయన స్థానంలో జిల్లా రెవెన్యూ అధికారిగా శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్‌ భూ సేకరణ విభాగం స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎమ్‌.గణపతిరావును నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా పనిచేస్తున్న కె.హేమలత మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. ఆ స్థానంలో సీహెచ్‌..భవానీ శంకర్‌ను నియమించారు. ఈ విధంగా నలుగురికి బదిలీ అయింది. వీరిలో ఇద్దరు అధికారులు జిల్లాలోనే వేర్వేరు పోస్టుల్లో నియమితులు కావడం గమనార్హం.


కొవ్వాడ ఎస్‌డీసీ కూడా ఇదివరకు జిల్లా రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇదిలా ఉండగా పార్వతీపురం  సబ్‌ కలెక్టర్‌గా నియమితులైన విధేఖరే బుధవారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా, సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సమయంలో కూర్మనాఽథ్‌ను ఐటీడీఏ పీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-08-13T09:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising