ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులపై నిర్లక్ష్యం వీడాలి

ABN, First Publish Date - 2020-09-30T10:32:09+05:30

కరోనా బాధిత జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట, సెప్టెంబరు 29: కరోనా బాధిత జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా లక్షణాలతో కొంతమంది విలేఖరులు చనిపోయారని, మరికొందరు వ్యాధి లక్షణాల తో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందతున్న వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించాలని, మృతి చెందినవారి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషి యో అందించాలని డిమాండ్‌ చేశారు.


జర్నలిస్టు హెల్త్‌కార్డులు పునరుద్ధరించాలని ఇళ్లస్థలాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఫ పార్వతీపురం రూరల్‌: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) పిలుపుమేరకు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఫ బొబ్బిలి: కొవిడ్‌ బారినపడిన జర్నలిస్టులను ఆదుకోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని జర్నలి స్టు ప్రతినిధులు కోరారు. పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్టులు స్థానిక ఎమ్మె ల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - 2020-09-30T10:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising