కనీస అవగాహనలేని ముఖ్యమంత్రి జగన్
ABN, First Publish Date - 2020-03-16T10:16:21+05:30
ఎన్నికల సంఘం విధులు, కరోనా వ్యాధి పైనా కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్‌రెడ్డి
శాసనమండలి ప్రతిపక్ష ఉపనేత సంధ్యారాణి
సాలూరు,మార్చి 15: ఎన్నికల సంఘం విధులు, కరోనా వ్యాధి పైనా కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని శాసన మండలి ప్రతిపక్ష ఉపనేత, ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ఆదివారం తన స్వగృహంలో విలేఖరులతో ఆమె మాట్లాడారు. కరోనా వ్యాధికి ప్రపంచ దేశాలు భయబ్రాం తులకు లోనవుతున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటిస్తుంటే అలాంటి భయంక రమైన వ్యాధి కేవలం పారాసిటిమాల్ మాత్రతో తగ్గి పోతుందనటం జగన్ చెప్పడం ఏలా అర్థం చేసుకోవడంలో తెలియడం లేదన్నారు. కరోనా 60 ఏళ్లల దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో భాధప డుతున్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటే వారు మనుషులు కా రా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి విచక్షణాధికారాలు ఉంటాయన్న విషయం కూడా ము ఖ్యమంత్రికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు.
Updated Date - 2020-03-16T10:16:21+05:30 IST