ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్రకు అన్యాయం

ABN, First Publish Date - 2020-11-14T04:34:15+05:30

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు తోటపల్లి పనులను ఐదేళ్లపాటు నిలిపేయాలన్న ప్రభుత్వం నిర్ణయాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దె బాబూరావు తెలిపారు.

మాట్లాడుతున్న గద్దె తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చీపురుపల్లి:

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంతో పాటు తోటపల్లి పనులను ఐదేళ్లపాటు నిలిపేయాలన్న ప్రభుత్వం నిర్ణయాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గద్దె బాబూరావు  తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ..   పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే విశాఖ ప్రజలు తాగు నీటికి కటకటలాడు తున్నారని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులు మరో ఐదేళ్లపాటు రద్దు చేస్తూ ప్రభుత్వం చేతులెత్తేయడం వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులకు తీవ్ర నష్టం చేకూరనుందన్నారు. ఇప్పటికే పిల్ల కాలువలు, స్లూయీస్‌ నిర్మాణాలు జరగక, రైతులు సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు.   జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతి నిధులు తక్షణమే దీనిపై స్పందించాలని గద్దె కోరారు. సమావేశంలో పార్టీ నాయకుడు శంకర్‌లాల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2020-11-14T04:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising