అక్రమ అరెస్టులు దారుణం
ABN, First Publish Date - 2020-11-14T04:56:05+05:30
మండలానికి చెందిన కొండ గంగుబూడి మాజీ సర్పంచ్, దేశం పార్టీ నాయకుడు చల్లా వెంకటరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేయడం దారుణమంటూ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
ఎస్‌కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
వేపాడ, నవంబరు 13: మండలానికి చెందిన కొండ గంగుబూడి మాజీ సర్పంచ్, దేశం పార్టీ నాయకుడు చల్లా వెంకటరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేయడం దారుణమంటూ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ దుశ్చర్యను దేశం పార్టీ యావత్ ఖండిస్తుందన్నారు. శుక్రవారం మండలంలోని వల్లం పూడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు శానాపతి తాతారావు స్వగృహంలో ఆయన సారథ్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విసృత స్థాయి పార్టీ సమావేశం లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుండడంతో పాటు అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం ఘోరమన్నారు. కొండగంగు బూడి మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావుకు ముందస్తు సమా చారం ఇవ్వకుండా మాట్లాడాలని రమ్మని అరెస్టు చేసి రాత్రికి రాత్రి జైలుకు పంపించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అరెస్టు చేసిన వెంకటరావు కుటుంబానికి నియోజకవర్గ పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోళ్ల రాంప్రసాధ్ మాట్లాడుతూ గతంలో బీహర్‌లో జరిగిన దుర్మార్గపు పాలన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి హయాంలో కనిపిస్తోందన్నారు. ఐదు మండలాల నాయకులు కోళ్ల శ్రీను, జీఎస్ నాయుడు, రాయవరపు చంద్రశేఖర్, వేపాడ మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, జేజ పెదరామునాయుడు, మహిళా నాయకురాలు గుమ్మడి భారతి చల్లా అరస్టును ఖండించారు. అనంతరం వల్లంపూడి ప్రధాన రహదారిలో వెంకటరావు అరెస్టును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-11-14T04:56:05+05:30 IST