ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార లేఅవుట్లు గుర్తింపు

ABN, First Publish Date - 2020-09-23T11:17:00+05:30

మునిసిపాలిటీ పరిఽధిలో 56 సర్వే నెం బర్లలో అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, సెప్టెంబరు 22: మునిసిపాలిటీ పరిఽధిలో 56 సర్వే నెం బర్లలో అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతబొబ్బిలి, మల్లమ్మపేట, గొల్లపల్లి రెవెన్యూ పరిధి లో ఈ అనధికార లేఅవు ట్లు ఉన్నాయన్నారు.


డిసెంబరు నెలాఖరు వరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్‌)  అమలులో ఉన్నందున ఈ అవకాశాన్ని సంబంధిత వ్యక్తులు వినియో గించుకోవాలని సూచించారు.   2019 ఆగస్టు లోగా కొనుగోలు చేసిన ప్లాట్‌ యజమానులు విడివిడిగా గాని, గ్రూపుగా గాని ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగిం చుకోవాలన్నారు.


7శాతం రుసుము చెల్లించి క్రమ బద్ధీకరించుకోవాలని పేర్కొన్నారు. అలా చేసుకున్న వారికి భవననిర్మాణ అనుమతులు లభిస్తాయ ని తెలిపారు. ఖాళీ స్థలం రుసుము 14 శాతం, డెవలప్‌ మెంట్‌ చార్జీల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు బ్యాంకు రుణాలు పొందొచ్చన్నారు. క్రమబద్ధీకరించుకోని ప్లాట్‌ యజమానులు గృహనిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందలేరన్నారు.


రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో సర్వేనెంబరు నిషిద్ధ జాబితాలో చేర్చుతామన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక సదుపాయాలను పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-23T11:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising