ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకీ కట్టేందుకు వెళ్లిన భార్యను తీసుకువచ్చేందుకు స్కూటీపై వెళ్తుండగా..!

ABN, First Publish Date - 2020-08-05T20:25:07+05:30

పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకురావ డానికి వెళ్తూ ప్రమాదవశాత్తు భర్త మృత్యుఒడిలోకి వెళ్లిన సంఘటన మండలంలోని అమటాంరాయవలస సమీప జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య కోసం వెళ్తూ మృత్యువు ఒడిలోకి..


భోగాపురం/విజయనగరం(ఆంధ్రజ్యోతి): పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకురావ డానికి వెళ్తూ ప్రమాదవశాత్తు భర్త మృత్యుఒడిలోకి వెళ్లిన సంఘటన  మండలంలోని అమటాంరాయవలస సమీప జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలిపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి సూర్యనారాయణ (35) దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాఖీ పౌర్ణిమ సందర్భంగా మృతుడు భార్య రమాదేవి డెంకాడ మండలం చింతలవలసలో ఉన్న సోదరుడు ఇంటికి రాఖీ కట్టేందుకు పిల్లలతో కలిసి వెళ్లారు. అనంతరం తిరిగి వచ్చేస్తామంటూ భర్త సూర్యనారాయణకు ఫోన్‌ చేయడంతో ఆయన సోమవారం రాత్రి స్కూటీపై చింతలవలస బయలుదేరి వెళ్తున్నాడు.


ఇంతలో అమటాంరాయవలస సమీపంలోకి వచ్చేసరికి ముందువెళ్తున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఎడమవైపు ఉన్న రైలింగును స్కూ టీతో ఢీకొన్నాడు. దీంతో పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డుపై పడటంతో  తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రుని తొలుత, 108లో విజయనగరం, అక్కడ నుంచి  వైద్యుల సూచనమేరకు తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలో మృతిచెంది నట్లు ఎస్‌ఐ తెలిపారు. సూర్యనారాయణకు భార్య రామాదేవి, పన్నెండేళ్లలోపు చిన్న పిల్లలుఉన్నారు.  మృతుడు తండ్రి చింతపల్లి కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-05T20:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising