ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లకే పరిమితం కావాలి

ABN, First Publish Date - 2020-03-24T08:18:59+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని, బయట తిరగడం మంచిది కాదని ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం ఎంపీ బెల్లాన 

31 వరకూ లాక్‌డౌన్‌


చీపురుపల్లి, మార్చి 23: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని, బయట తిరగడం మంచిది కాదని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ సూచించారు. సోమవారం  చీపురుపల్లిలోని తన నివాసంలో వ్యాపారులు, పోలీసు, వైద్య ఇతర అన్ని శాఖల అధికారులతో   ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌ మరింత ఉధృతి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 31 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిందని తెలిపారు.


నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందుల దుకాణాలు తప్పా మిగతావి మూసివేయాలన్నారు. దీనికి వ్యాపారులు సహకరించాలని కోరారు. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీ హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో కె.రామకృష్ణంరాజు, తహశీల్దారు పీవీ శ్యామసుందర్‌, ప్రభుత్వాసుపత్రి డీసీఎస్‌ డాక్టర్‌ నారాయణ, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, వ్యాపారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-24T08:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising